Header Banner

రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన ఆర్‌ఆర్‌బీ! ఎందుకంటే..!

  Mon Apr 28, 2025 17:24        Education

రైల్వే శాఖలో దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో పోస్టుల భర్తీకి ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) వరుస నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయా పోస్టులకు తాజాగా నియామక పరీక్షలు కూడా జరిపింది. మరికొన్ని ఉద్యోగాలకు నియామాక పరీక్షలు జరగనున్నాయి. అయితే రైల్వేలో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్‌ 22న సీబీటీ 2 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక కీ కూడా ఇటీవల విడుదలైంది. అభ్యర్థులు రూ.50 చెల్లించి కీ పై అభ్యంతరాలను ఏప్రిల్‌ 30వ తేదీలోపు తెలపవచ్చని బోర్డు వెల్లడించింది. లేవనెత్తిన అభ్యంతరం సరైనదని తేలితే అభ్యర్థి ఆన్‌లైన్ చెల్లింపు చేసిన ఖాతా నుండి వాపసు చేస్తారు.
అయితే ఈపరీక్షకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఆర్‌బీ జేఈ షిఫ్ట్‌-2 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 22న నిర్వహించిన ఈ పరీక్షలో ఉదయం షిఫ్ట్‌ 1లో వచ్చిన ప్రశ్నలు రెండవ షిఫ్ట్‌లో కూడా వచ్చినట్లు గుర్తించింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటన జారీ చేసింది. సాంకేతిక సమస్యల వల్ల ఇలా జరిగినట్లు ఆర్‌ఆర్‌బీ వివరణ ఇచ్చింది. ఇక పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 20,792 మంది అభ్యర్థులు హాజరయ్యారు. త్వరలో వారందరికీ పరీక్షను మరోసారి నిర్వహించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది.
ప్రశ్నల సెట్లను క్రియెట్‌ చేయడానికి, ప్రాసెసింగ్, నిర్వహణ, నిల్వ, ఎన్‌క్రిప్షన్ వంటి వాటికోసం అడ్మిన్‌లో అత్యున్నత స్థాయి గోప్యతను నిర్వహించడానికి ఆర్‌ఆర్‌బీ ఓ వ్యవస్థను అనుసరిస్తుంది. ప్రశ్నపత్రాల సెట్టింగ్, పరీక్షా కేంద్రాలకు పంపడంతో మానవ జోక్యం లేకుండా ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా చేస్తుంది. ఇదంతా సాఫ్ట్‌వేర్ ఆధారిత పద్దతి ద్వారా జరుగుతుంది. కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్య కారణంగా ఈ నెల 22న జరిగిన 2వ షిఫ్ట్‌లో పరీక్షలో కొన్ని ప్రశ్నలు పునరావృతం అయినందున ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని, త్వరలోనే వీరికి కొత్త పరీక్ష తేదీని వెల్లడించి, మరోమారు పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో ఆర్ఆర్‌బీ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఏపీ డీఎస్సీ! టెట్ వెయిటేజీతో కొత్త రూల్స్..! అభ్యర్థులకు కీలక సూచనలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapraavsi #RRBUpdate #RailwayJobs #RRBExamCancelled #RRBJE #ExamAlert #RRBNotification #JobAspirants